వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది. దీంతో ప్రయాణికులకు అదనపు సౌకర్యాల కల్పనపై రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. విజయవాడ మీదుగా నడిచే ఈ రైళ్ల మెనూలో అధికారులు మార్పులు చేశారు. వెజ్, నాన్ వెజ్‌తో పాటు ఇకపై షుగర్ పేషెంట్లకు డయాబెటిక్ ఫుడ్ పేరుతో భోజనం అందించనున్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ క్యాలరీలతో ఆహారాన్ని ఇస్తారు. దాని ధర రూ. 220. దీనితోపాటు జైనులకు జైన్‌ఫుడ్ పేరిత సాత్వికాహారన్ని అందిస్తారు. ఇందుకోసం ప్రయాణికుల రైల్వే, ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
Previous Articleవిడాకుల వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు
Next Article వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
Keep Reading
Add A Comment