Telugu Global
Andhra Pradesh

పవన్ తో టీ, లోకేష్ తో కాఫీ.. అలా నిధులు రాబడదాం

పవన్ కల్యాణ్ తో కలసి టీ తాగడం కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆల్రడీ జరిగిందని, లోకేష్ తో కలసి అరకు కాఫీ తాగేవారితో మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్ట వచ్చని అన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.

పవన్ తో టీ, లోకేష్ తో కాఫీ.. అలా నిధులు రాబడదాం
X

ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత ఉందని అధికార పార్టీ గత ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. అయితే ఈ నిధుల కొరతకు తనదైన శైలిలో ఓ ప్రత్యామ్నాయం సూచించారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. పవన్ కల్యాణ్ తో కలసి టీ తాగడం కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆల్రడీ జరిగిందని, లోకేష్ తో కలసి అరకు కాఫీ తాగేవారితో మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్ట వచ్చని అన్నారాయన. అలా నిధులు సేకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట వచ్చని సూచించారు.


ఎందుకీ నిధులు..?

ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై ఎమ్మెల్యే రఘురామరాజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఓ అనుబంధ ప్రశ్న అడిగారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో జన్మభూమి కార్యక్రమ స్ఫూర్తితో కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఇప్పుడు ఫండ్ రైజింగ్ ద్వారా వాటిని ఉపయోగంలోకి తేవచ్చని అన్నారు. విద్యార్థులను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు రఘురామరాజు.

బెల్లుకొట్టేస్తారా..?

సమావేశాల తొలిరోజు జగన్ తో కాసేపు మాట్లాడి టాక్ ఆఫ్ అసెంబ్లీగా మారిన రఘురామరాజు, రెండోరోజు కూడా తనదైన శైలిలో కాసేపు నవ్వులుపూయించారు. అంత తొందరగా బెల్లు కొట్టేస్తారా..? అని స్పీకర్ తో అన్నారు. తాను ఎక్కువ టైమ్ తీసుకోనని, తన ప్రశ్నను త్వరగా ముగిస్తానని చెప్పారు.

First Published:  23 July 2024 11:30 AM IST
Next Story