టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. నిందితులకు ముగిసిన సిట్ విచారణ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ నేటితో ముగిసింది.
BY Vamshi Kotas18 Feb 2025 7:07 PM IST

X
Vamshi Kotas Updated On: 18 Feb 2025 7:07 PM IST
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నలుగురు నిందితుల విచారణకు కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో విచారణ అనంతరం నిందితులను రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తిరుపతి రెండవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్‌ను 5 రోజులుగా నెయ్యి కల్తీ ఘటనకు సంబంధించి సిట్ అధికారులు విచారించారు. నిందితులు విచారణకు సహకరించలేదని, మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ కోరినట్లు తెలుస్తోంది. సోమవారం జరగాల్సిన నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ బుధవారం జరగనుంది.
Next Story