Telugu Global
Andhra Pradesh

తిరుమల తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే : వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు

తిరుమల తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే : వైవీ సుబ్బారెడ్డి
X

తిరుమల తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. టీటీడీ అధికారులు ఈవో సరైన సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన పోలీస్ ఫోర్స్‌ను టోకెన్ల జారీ కేంద్రం వద్ద ఉపయోగించ లేదని అన్నారు. రాబోయే పది రోజుల్లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

భద్రతా ఏర్పాట్లు సరిగా చేసి ఉంటే ప్రాణాలు అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నెలరోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు, పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని ఆయన అన్నారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. తమిళనాడు శ్రీరంగం తరహాలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని.. రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు

First Published:  9 Jan 2025 3:06 PM IST
Next Story