Telugu Global
Andhra Pradesh

మంత్రి లోకేశ్‌ కృషి వల్లనే ఇది సాధ్యమైంది

గూగుల్‌తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు

మంత్రి లోకేశ్‌ కృషి వల్లనే ఇది సాధ్యమైంది
X

ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్ననారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అన్నారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్‌ వస్తాయి. విశాఖలో గూగుల్‌ కంపెనీ ఏర్పాటునకు ఎంవో కుదిరింది. మంత్రి లోకేశ్‌ కృషి వల్లనే ఇది సాధ్యమైంది. గూగుల్‌తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుంది. హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదు.. స్మార్ట్‌ వర్క్‌ కావాలని అని సీఎంచంద్రబాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులోభాగంగా భవిష్యత్‌ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఆరు నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్షిస్తున్నారు. శాంతిభద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో ఆరా తీస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ప్రజంటేషన్‌ను సీఎం ఇవ్వనున్నారు. నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై సమాలోచనలు చేయననున్నారు.

First Published:  11 Dec 2024 12:56 PM IST
Next Story