ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు.. 2.0 వేరేగా ఉంటది : వైఎస్ జగన్
తొలివిడతలో ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాని మాజీ సీఎం జగన్ అన్నారు.
ఏపీలో ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇవాళ ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.‘‘విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. టీడీపీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని జగన్ అన్నారు.
ఈ 2.0 వేరేగా ఉంటుందని కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తామన్నారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు సీఎం చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చారించారు.