Telugu Global
Andhra Pradesh

వంద రోజుల పాలనలో కూటమి సర్కార్ ఒక్క హామీ అమలు చేయలేదు : వైఎస్ షర్మిల

వంద రోజుల పరిపాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.

వంద రోజుల పాలనలో కూటమి సర్కార్ ఒక్క హామీ అమలు చేయలేదు : వైఎస్ షర్మిల
X

కూటమి సర్కార్ వంద రోజుల పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'థాలీ బజావో' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల హామీ అమలు గురించి సీఎం చంద్రబాబు వినపడేలా పళ్లెం, గంటెతో షర్మిల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారని ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. వైసీపీ పరిపాలనపై ప్రజలు విసుకు చెంది కూటమి ప్రభుత్వాన్నికి ప్రజలు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరదలకు 7లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతుల పరిహారం తగ్గించారని. తల్లికి వందనం పథకం ఎందుకు అమలు చేయటం లేదని షర్మిల ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటోందని.. ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని ప్రభుత్వం మంచిదెలా అవుతుందని ప్రశ్నించారు. సర్కార్ దగ్గర నిధులు లేవంటున్న చంద్రబాబుకి ఎన్నికలకు ముందే రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్లు అప్పులున్నాయని తెలియదా అని నిలదీశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని.. అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలివ్వాల్సిన కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో ఉద్యోగాల కల్పన మీద ప్రణాళికలు కూడా రచించలేదని విమర్శించారు.

ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవన్నారు. వరద బాధితులకు కనీసం ఒక్క రైల్ నీర్ బాటిల్ కూడా ఉచితంగా ఇవ్వలేదని. ఏడాదికి రూ.6వేల కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ద్వారా రైల్వే శాఖ వస్తుంది. ఇదేనా ప్రధాని మోదీ రాష్ట్రం మీద ప్రేమ..? రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలన్నారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు.. బడ్జెట్ లేని రాష్ట్రం కూడా. 100 రోజుల్లో ఏ పథకానికి ఎంత బడ్జెట్‌నో చెప్పే ధైర్యం లేదు. బాధ్యతలను విజయాలుగా చెప్పుకోవడం మానుకోలని షర్మిల అన్నారు.

First Published:  25 Sept 2024 12:57 PM GMT
Next Story