Telugu Global
Andhra Pradesh

నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది.

నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా
X

నేడు జరగాల్సిన ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు.. నారా రామ్మూర్తి రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. నేటి శాసన సభ సమావేశాల్లో సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం.. మంత్రి పొంగూరు నారాయణ అనంతపురం, హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19 సంవత్సరాల్లో ప్రభుత్వ రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024, మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కో ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

First Published:  18 Nov 2024 9:12 AM IST
Next Story