నువ్వు బెంగళూరు ఎందుకెళ్లావ్..? నువ్వు దేశం విడిచి ఎక్కడికెళ్లావ్..?
సోషల్ మీడియాలో అఫిషియల్ హ్యాండిల్స్ లో కూడా వినలేని, చదవలేని పదాలు వచ్చి చేరుతున్నాయి. నిక్కర్ మంత్రీ అని వైసీపీ సెటైర్ వేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ మరింత దారుణమైన భాషలో బదులిస్తోంది.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ ట్వీట్లు, ప్రతిగా టీడీపీ నుంచి పడుతున్న కౌంటర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వైసీపీ నుంచి నేరుగా జగన్ ట్వీట్లు చేస్తున్నా.. కూటమి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం నేరుగా స్పందించడంలేదు. అడపాదడపా లోకేష్ కౌంటర్లిస్తున్నారు. ఇక టీడీపీ, వైసీపీ అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో అయితే ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నిక్కర్ మంత్రీ అని వైసీపీ సెటైర్ వేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ మరింత దారుణమైన భాషలో బదులిస్తోంది.
కట్ డ్రాయర్ ఎమ్మెల్యే ..
— Telugu Desam Party (@JaiTDP) August 13, 2024
నిలువెత్తు ఫేకు ఫెలోవి నువ్వు. నీకున్న లండన్ పిచ్చతో, హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, అన్నీ నేరవేర్చేసా అనే భ్రమలో బ్రతుకుతున్న ఫేకు ఫెలోవి..
మేనిఫెస్టోను ఒక దొంగ సాక్షి టీవీగా, ఒక దొంగ సాక్షి పేపర్ గా చూస్తూ, చేసింది చేయనట్టు భ్రమలో చూపించావు… https://t.co/PgYjRJLa5w
తాజాగా లోకేష్, జగన్ పర్యటనలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముందుగా ఈ ట్వీట్ వార్ ని వైసీపీ మొదలు పెట్టింది.
హలో నారా లోకేష్..!
జులై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్లావు? ఎవరితో చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏ దేశం వెళ్లావు? విదేశాల్లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి? అంటూ వైసీపీ ట్వీట్ వేసింది.
హలో @naralokesh..
— YSR Congress Party (@YSRCParty) August 14, 2024
జూలై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్లావు? ఎవరితో చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏ దేశం వెళ్లావు? విదేశాల్లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి?
దీనికి టీడీపీ నుంచి కౌంటర్ పడింది.
హలో జగన్..!
ఆగస్టు 10, 11 తేదీల్లో నువ్వు బెంగళూరు నుంచి కోల్ కతా ఎందుకు వెళ్ళావ్ ? ఎవరితో చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కోల్ కతా హోటల్ లో ఎందుకు ఉన్నావ్ ? ఆ హోటల్ లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి ? అంటూ టీడీపీ నుంచి ట్వీట్ పడింది.
హలో @ysjagan..
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2024
ఆగస్టు 10, 11 తేదీల్లో నువ్వు బెంగుళూరు నుంచి కలకత్తా ఎందుకు వెళ్ళావ్ ? ఎవరితో చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కలకత్తా హోటల్ లో ఎందుకు ఉన్నావ్ ? కలకత్తా హోటల్ లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి ?#FekuJagan#EndOfYCP#AndhraPradesh
సోషల్ మీడియాలో అభిమానులు, కార్యకర్తలు.. ఇలాంటి ట్వీట్లు వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అఫిషియల్ హ్యాండిల్స్ లో కూడా వినలేని, చదవలేని పదాలు వచ్చి చేరుతున్నాయి. వ్యక్తిగత విమర్శలను తారా స్థాయికి చేరుస్తున్నాయి.