పలావు, బిర్యానీ.. టీడీపీ కౌంటర్ ఏంటంటే..?
జగన్ పలావు పెట్టారు సరే, ఎప్పుడు పెట్టారు..? 2019లో గెలిచి ఆ తర్వాత ఆరేడు నెలలకు పథకాలు మెల్ల మెల్లగా అమలులోకి తెచ్చారు. మరిప్పుడు కూటమి గెలిచిన రెండు నెలల్లోనే బిర్యానీ వండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
"జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు..
చంద్రబాబుని నమ్మి ఓట్లు వేశారు..
బిర్యానీ పాయే, పలావు పాయే.. లాస్ట్ కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి.." అంటూ ఇప్పుడున్న పరిస్థితిని సూటిగా, స్పష్టంగా చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రజలు బిర్యానీకి ఆశపడి ఓట్లు వేశారని, ఇప్పుడు తిప్పలు పడుతున్నారని, చంద్రబాబుని నమ్ముకుంటే అదే జరుగుతుందని ఆయన విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వివరించారు.
TRUE WORDS
— YSRCP Brigade (@YSRCPBrigade) August 7, 2024
జగన్ పలావ్ పెడతానని చెప్పాడు.
చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పాడు.
బిర్యానీకి కక్కుర్తి పడ్డారు ఇప్పుడు పలావ్ లేదు బిర్యానీ లేదు.
- జగనన్న pic.twitter.com/jInIgL4joO
టీడీపీ కౌంటర్..
జగన్ పలావు పెట్టారు సరే, ఎప్పుడు పెట్టారు..? 2019లో గెలిచి ఆ తర్వాత ఆరేడు నెలలకు పథకాలు మెల్ల మెల్లగా అమలులోకి తెచ్చారు. మరిప్పుడు కూటమి గెలిచిన రెండు నెలల్లోనే బిర్యానీ వండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. జగనే ఉండి ఉంటే ఇంకా అవ్వాతాతలకు రూ.3వేలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, ఐదేళ్లలో పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తానన్నారని, కానీ టీడీపీ రాగానే తొలి నెలలోనే రూ.4వేలు పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లించిందంటున్నారు. అంటే ఇది బిర్యానీ కాదంరాటా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
జనాలెవరూ పస్తులు పడుకోవట్లేదని, కేవలం వైసీపీ నేతలే అధికారం పోయి పస్తులుంటున్నారని కౌంటర్లిస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఫిరాయింపు నేతల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలకు కూడా టీడీపీ కౌంటర్ ఇస్తోంది. 2019లో గెలిచాక ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ అవమానించిందని, ఆయనకు 2024లో మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది టీడీపీయేనని గుర్తు చేస్తున్నారు నేతలు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే జగన్ ఎంపీటీసీలు, జడ్పీటీసీల్ని కలసి నీతి, న్యాయం.. అని చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు వారిలో ఎంతమందిని జగన్ కలిశారని నిలదీస్తున్నారు. అవసరం ఉంది కాబట్టే ఇప్పుడు నేతలందర్నీ జగన్ పలకరిస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్లు దొరకలేదని గుర్తు చేస్తున్నారు.