Telugu Global
Andhra Pradesh

ఏపీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బంద్.. ఎందుకో తెలుసా?

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి ఏపీ హోటల్స్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14నుంచి ఈ అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రెస్టారెంట్ల నిర్వాహకులు తెలిపారు.

ఏపీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బంద్.. ఎందుకో తెలుసా?
X

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి ఏపీ హోటల్స్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14నుంచి ఈ అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రెస్టారెంట్ల నిర్వాహకులు తెలిపారు. నగదు చెల్లింపులు చేయకుండా స్విగ్గీ వారు ఇబ్బందులు పెడుతున్న తీరుపై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు. ఆర్. వి. స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామన్నారు. స్విగ్గీ, జుమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న ముడు విడతలుగా స్వీగ్గీ, జుమాటో ప్రతినిధులతో చర్చించాం.

తమ అభ్యంతరాలను జుమాటో కొంతవరకు అంగీకరించింది.. స్వీగ్గీ కాలయాపన చేస్తూ వస్తుంది. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల ఈనెల 14 వ తేదీ నుంచి స్విగ్గీ బాయ్ కాట్ చేస్తున్నాం. స్విగ్గీ, జుమాటోకు సహకరించేందుకు మేము సిద్దంగానే ఉన్నాం. నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతున్నాం. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  4 Oct 2024 1:07 PM GMT
Next Story