వివేక హత్య కేసులో భాస్కర్‌రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుడు భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తొలుత సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరూతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.హైకోర్టు నిర్ణయాన్ని తొలుత సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి బెయిల్‌ను క్యాన్సిల్ చేయాలని కోరూతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ప్రతివాదులు భాస్కర్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సునీత పిటిషన్ తో జతచేస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని, ఆ పార్టీ నాయకులు అందరిని ఓడించాలని కొన్ని జిల్లాలలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సునీత టీడీపీకి అమ్ముడుపోయారని కొంత మంది వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆరోపించారు.