Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ బర్త్‌డే నిర్వహిస్తే కఠిన చర్యలే : కుప్పం డీఎస్పీ

జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఆంక్షల విధించారు.

వైఎస్ జగన్ బర్త్‌డే నిర్వహిస్తే కఠిన చర్యలే : కుప్పం డీఎస్పీ
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఆంక్షల విధించారు. రేపు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ తెలిపారు. పుట్టిన రోజు వేడుకలు కార్యాలయంకే పరిమితం కావాలని , బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే చట్ట పరంగా చర్యలు అంటూ పోలీసులు అదేశాలు ఇచ్చారు.

అయితే ఏపీ పోలీసుల వైఖరిపై మండిపడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు. కుప్పంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తుగా పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో.. వినతి పత్రంపై కుప్పం డీఎస్పీ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ పీఏ మురుగేష్‌కు లేఖను అందజేశారు. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి ఈ నెల 19 నుంచి 22 వరకు కుప్పంలో పర్యటిస్తున్నారని, ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ సంబరాలు చేయకూడదని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వైఎస్‌ జగన్‌ జన్మదిన సంబరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

First Published:  20 Dec 2024 9:55 PM IST
Next Story