Telugu Global
Andhra Pradesh

గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు..పోటెత్తిన భక్తజనం

తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గరుడ సేవ ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.

గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు..పోటెత్తిన భక్తజనం
X

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించారు. శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుని వాహనంపై ఊరేగడాన్ని చూసేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యి, పులకించి పోయారు. గరుడసేవలో భాగంగా మూల విరాట్ ను అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీ వేంకటేశ్వర సహస్రమాల వంటి అభరణాలతో ఉత్సవ మూర్తిని అలంకరించి ఊరేగించారు. గరుడ వాహనంపై విహరించే మలయ్యప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాగా నేటి సాయంత్రం జరిగిన గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.

సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన గరుడసేవ మాడవీధుల గుండా కొనసాగింది.గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. సౌపర్ణుడు అంటే విశేషమైన రెక్కలు కలవాడు. తన తల్లి వినత దాస్యాన్ని అంతంచేసేందుకు అమృతభాండం తెచ్చిన కార్యశీలి. పక్షుల్లో రాజు వంటివాడు. అందుకే శ్రీమహావిష్ణువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు.గరుడ సేవను ప్రత్యేకంగా తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మాడ వీధుల్లో 231 గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం కూడలి నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. గరుడిపై విహరిస్తున్న మలయప్పస్వామి ఊరేగింపు రాత్రి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఏపీ ఆర్టీసీ 400 బస్సులను ఏర్పాటు చేసింది.

First Published:  8 Oct 2024 3:01 PM GMT
Next Story