Telugu Global
Andhra Pradesh

పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని షర్మిల లాంతర్ ర్యాలీ

పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో లాంతర్ ర్యాలీ నిర్వహించారు

పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని షర్మిల లాంతర్ ర్యాలీ
X

ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుందని షర్మిల అన్నారు. ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు. వైసీపీకి కూటమికి చంద్రబాబు ప్రభుత్వాన్నికి తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే.. ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు.

ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే. ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం అని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి.. ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో వసూలు చేస్తున్నారని షర్మిలపేర్కొన్నారు

First Published:  7 Nov 2024 9:20 PM IST
Next Story