Telugu Global
Andhra Pradesh

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
X

దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఏపీలో మరో 6 గంటల్లో ఇది తపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయిని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్‌ కుమార్‌ తెలిపారు. ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది.

రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. రేపు నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

First Published:  27 Nov 2024 7:42 PM IST
Next Story