Telugu Global
Andhra Pradesh

మంచు విష్ణుకి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్ర‌కాశ్ రాజ్

తిరుమల లడ్డూ ప్రసాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై మా' అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు.

మంచు విష్ణుకి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్ర‌కాశ్ రాజ్
X

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. "ప్రకాశ్ రాజ్ గారూ, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి?" అని ట్వీట్ చేశారు.

"మీ హద్దుల్లో మీరు ఉండండి" అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కన్నప్ప సినిమా టీజర్‌లో ఆఖరి డైలగ్‌ను హేళన చేస్తు ట్వీట్ చేశారు. ఓకే శివయ్య నాకు నా దృక్కోణం ఉంటే మీకు ఆలోచన ఉంటుంది. నోటెడ్ అని ట్వీట్ చేశారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటి చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని ప‌వ‌న్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ కూడా ఎక్స్ వేదిక‌గా పవ‌న్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

First Published:  21 Sept 2024 10:19 AM
Next Story