Telugu Global
Andhra Pradesh

స్థిరత్వం లేని వ్యక్తి పవన్..ప్రకాశ్‌రాజ్ మరోసారి విసుర్లు

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు.

స్థిరత్వం లేని వ్యక్తి పవన్..ప్రకాశ్‌రాజ్ మరోసారి విసుర్లు
X

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పాలిటిక్స్‌లో పవన్ ఫుట్‌బాల్ లాంటివారని ఆయనను ఎవరైన ఉపయోగించుకుంటారని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. పవన్ తిరుపతిలో మాట్లాడిన స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఉన్నయని పేర్కొన్నారు. హీరోగా అనేక సినిమాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. రాజకీయం అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది" అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు. ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే.

ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా.. దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే. స‌నాత‌న ధ‌ర్మంపై తిరుపతిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులో ఆయనపై ఒక ఫిర్యాదు చేశారు. మత కలహాలు సృష్టించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని మధురై పోలీసు కమిషనర్ ఆఫీస్‌లో ఓ న్యాయవాది కంప్లైంట్‌లో పేర్కొన్నారు

First Published:  7 Oct 2024 11:21 AM IST
Next Story