సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం సమావేశం అయ్యింది.
BY Vamshi Kotas7 Feb 2025 3:35 PM IST
![సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401205-cbn.webp)
X
Vamshi Kotas Updated On: 7 Feb 2025 3:35 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047-విజన్ డాక్యుమెంట్ పై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో లోటు బడ్జెట్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదని, సూపర్ సిక్స్ గ్యారెంటీలకు కూడా నిధుల లోటు గురించి ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఈ మీటింగులో పాల్గొన్నారు
Next Story