Telugu Global
Andhra Pradesh

పీలేరు యాసిడ్ దాడిని ఖండించిన వైఎస్ జగన్‌

YS Jagan has condemned the acid attack in Peeleru

పీలేరు యాసిడ్ దాడిని ఖండించిన వైఎస్ జగన్‌
X

అన్నమయ్య జిల్లా పీలేరులో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మాజీ సీఎం జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితరాలికి అండగా ఉండాలని మెరుగైన వైద్యం అందించాలని జగన్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు. అ‍న్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం దారుణ ఘటన జరిగింది. వాలెంటన్స్ డే రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు.

ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమిపై ప్రేమోన్మాది గణేష్‌ యాసిడ్‌ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే సదరు యువతి కి వివాహం నిశ్చయం అయ్యింది. ఏప్రిల్‌ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే యువతి పెళ్లిపై గణేష్‌ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డాని తెలుస్తోంది.

First Published:  14 Feb 2025 3:44 PM IST
Next Story