Telugu Global
Andhra Pradesh

కోటిమంది టీడీపీ కార్యకర్తలకు బీమా

ఈ మేరకు యునైటెడ్‌ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేసిన లోకేశ్

కోటిమంది టీడీపీ కార్యకర్తలకు బీమా
X

కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు యునైటెడ్‌ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు. ఈమేరకు యునైటెడ్‌ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు. జనవరి 1 నుంచే ఇన్స్యూరెన్స్‌ కవర్‌ అయ్యేలా అగ్రిమెంట్‌ రూపొందించారు.

కోటిమంది కార్యకర్తలకు ఒకేసారి ఇన్స్యూరెన్స్‌ కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం.ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టాక కేడర్‌ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు రూ. 138 కోట్లు ఖర్చు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకోవడానికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు.


First Published:  2 Jan 2025 12:50 PM IST
Next Story