Telugu Global
Andhra Pradesh

రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం : పవన్ కళ్యాణ్

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం : పవన్ కళ్యాణ్
X

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మంత్రుల ఎంపికలో కులం చూసి కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 15 రోజుల చొప్పున జిల్లాల్లో పర్యటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తాం..మంత్రి అనేది తర్వాత చర్చ చేస్తామని తెలిపారు. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పని మంతుడా కాదా? అన్నది చూడాలి. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించామని పవన్ అన్నారు.‘మనోహర్‌, హరిప్రసాద్‌ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారు.

ఎవరికి ప్రతిభ ఉందో చూసి, వాళ్లకు పదవులు ఇస్తాం. ఈ విషయంలో మీరెందుకు జగన్‌ను అగడలేదు? కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నాం. కుదరలేదు కాబట్టి, ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్‌ ఏ కులమో నాకు తెలియదు. ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అని డిప్యూటీ సీఎం అన్నారు.

First Published:  30 Dec 2024 2:36 PM IST
Next Story