Telugu Global
Andhra Pradesh

తిరుమల లడ్డూ నాణ్యతపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ నాణ్యతపై మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమన్నారు

తిరుమల లడ్డూ నాణ్యతపై  నాగబాబు సంచలన వ్యాఖ్యలు
X

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై జనసేన నేత, మెగా బ్రదర్ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు'' అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.''ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల దేవలయ ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం'' అని నాగబాబు దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరు ఓ మతాన్ని స్వీకరించి ఆ దేవుని నిష్టతో పూజించి ఆ భగవంతుడికి ప్రసాదాం అర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు.

అంతటి విశిష్టమైన ప్రసాదాన్ని అందులోను శ్రీవారి వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో.. జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు. అందుకే టీటీడీ శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో వచ్చాక టీటీడీ చైర్మన్‌ పదవికి నాగబాబు ఇస్తారని ఊహాగానాలు వినిపించిన సంగతి విదితమే

First Published:  21 Sept 2024 4:23 PM IST
Next Story