Telugu Global
Andhra Pradesh

అది కులమీడియా, నార్త్ కొరియా మీడియా

పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

అది కులమీడియా, నార్త్ కొరియా మీడియా
X

తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పే క్రమంలో ఓ వర్గం మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. జర్నలిస్ట్ వేల్యూస్ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. వారిపై చర్యలకు తాను వెనకాడబోనని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ వేశారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు లోకేష్. ఆయన ట్వీట్ కు ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు. కులమీడియాకు లోకేష్ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు.


నార్త్ కొరియా మీడియా..

నారా లోకేష్, ఆయనకు సంబంధించిన కులమీడియా పత్రికా స్వేచ్ఛను కోరుకోవడం హాస్యాస్పదం అన్నారు విజయసాయిరెడ్డి. పాశ్చాత్య మీడియా లాగా వారు పత్రికా స్వేచ్ఛను కోరుకుంటున్నారని, కానీ వారి ప్రవర్తన అంతా ఉత్తర కొరియా మీడియాలాగా ఉంటుందని ఎద్దేవా చేశారు. పాత్రికేయ విలువలను వారు తుంగలో తొక్కారని మండిపడ్డారు. వారి పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియాలో తప్పుడు వార్తలు ఇచ్చారని, తన పరువుకి భంగం కలిగించారని ఆయన అంటున్నారు. తప్పుడు వార్తలు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తానన్నారు విజయసాయిరెడ్డి.

First Published:  16 July 2024 10:36 AM GMT
Next Story