ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
ఏపీలో 27 మంది ఐపీఎస్‌లను బదీలి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
BY Vamshi Kotas20 Jan 2025 8:47 PM IST

X
Vamshi Kotas Updated On: 20 Jan 2025 8:47 PM IST
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి, గ్రేహౌండ్స్ డీఐజీగా బాజ్జీ, ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీ డీఐజీగా పకీరప్ప, స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్ ను నియమించింది. కర్నూల్ ఎస్పీగా విక్రంత్ పాటిల్, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజును పోస్టింగ్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Next Story