తిరుమల తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
BY Vamshi Kotas9 Jan 2025 6:30 PM IST
X
Vamshi Kotas Updated On: 9 Jan 2025 6:31 PM IST
తిరుమల తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదని చెప్పారు. డిఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని ఆయన అన్నారు. గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటుమని ముఖ్యమంత్రి అన్నారు. రమణ కుమార్, హరనాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు అధికారులు బాధ్యత లేకుండా పనిచేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరే కాదు.. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
Next Story