Telugu Global
Andhra Pradesh

జగన్‌ ప్రభుత్వమే మేలు..కూటమి సర్కార్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌ ప్రభుత్వమే బెటర్ అంటూ …కూటమి ప్రభుత్వంపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన

జగన్‌ ప్రభుత్వమే మేలు..కూటమి సర్కార్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

గత వైసీపీ ప్రభుత్వమే మేలు అని కూటమి ప్రభుత్వంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సుల దగ్ధం కేసులో పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. బస్సులు షాట్ సర్య్కూట్‌తో తగలబడలేదని.. పక్కా ప్లాన్ ప్రకారమే కావాలనే తగులబెట్టారని బూతులతో విరుచుకుపడ్డారు. వాళ్లెవరో కనిపెట్టే దమ్ము, ధైర్యం పోలీసులకు అసలు ఉందా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని.. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయం చేయడం చేతకాదని ఫైర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌ను మెచ్చుకున్నారు. జగనే బెటర్ నా బస్సులు ఆపారు.. ఈ బీజేపీ గవర్నమెంట్ నా బస్సులను తగలబెట్టించారని ఆగ్రహించారు.

ఇక అటు బీజేపీ నేత యామిని శ‌ర్మ‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే మ‌నిషుల‌తో మాట్లాడిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత మాధవీలత జేసీ ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మండిపడ్డారు. ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదని అన్నారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ పై మాధవీలత స్పందిస్తూ... జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో వీడుదల చేశారు.

First Published:  3 Jan 2025 2:17 PM IST
Next Story