నటి మాధవీలతకు జేసీ క్షమాపణలు
సినీ నటి మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.
సినీ నటి మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు. బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ చూసే తాను టీడీపీలో ఉన్నాని జేసీ అన్నారు. తాడిపత్రి కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. తాడిపత్రి ప్రజలే నాకు సైన్యం. నియోజకవర్గ ప్రజలు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. పేర్కొన్నారు. ఈరోజు నా మీద మాట్లాడే ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలో ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్లే. గత రెండు రోజులుగా నాపై మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి చెబుతున్నాను. కొందరు పార్టీ మారతాడని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. కేవలం నేను సీఎం చంద్రబాబు నాయుడు విజయం చూసి ఈ పార్టీలో ఉన్నాను. చంద్రబాబు మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలోనని అహర్నిశలు కష్టపడుతున్నారు. అదే విధంగా నేను తాడిపత్రిని అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడుతున్నాను. మరో రెండు సంవత్సరాలలో తాడిపత్రిని ది బెస్ట్ గా చూపిస్తాని ఆయన అన్నారు