శ్రీవారి లడ్డూపై చంద్రబాబు నీచ రాజకీయం : జగన్
దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు అని వైఎస్ జగన్ విమర్శించారు
ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన అంతా మోసమేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. సూపర్-6 స్కీమ్స్ అమలు కావడం లేదన్నారు. కూటమి సర్కార్ అబద్దాలతో పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. గోరుముద్ద గాలికెరిగింది. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తెలిపారు. చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని ధ్వజమెత్తారు. దేవుడిని కూడా రాజకీయల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరని 100 రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అందుకే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ అన్నారు. కల్తీ నెయ్యి అనేది ఓ కట్టు కథ అన్నారు. కోట్లాది హిందువుల మనోభవాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లడారని జగన్ ఫైర్ అయ్యారు. నాసిరకం వస్తువులు వాడారని, నెయ్యి కి బదులు జంతువుల కొవ్వు వాడారని సీఎం హోదాలో మాట్లాడటం ఆశ్యర్యం కలిగించిందన్నారు. కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా..? అన్నారు. ప్రోసిజర్ ఏంది.. ప్రక్రియ ఏంది..? ఎలా జరుగుతుందనే దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం జరిగేది.
ప్రతీ ఆరు నెలలకొకసారి ఆన్ లైన్ లో టెండర్లు పిలుస్తారు. ఆన్ లైన్ లో పిలిచిన టెండర్లకు రొటిన్ గా జరిగే కార్యక్రమానికి సంబంధించి.. కొత్తగా మార్చేది ఏమి లేదు అని జగన్ తెలిపారు. లడ్డూ, నైవేద్యం తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతుంది కొత్తగా మార్పులు చేసేది ఏమి ఉండదన్నారు. లడ్డూ తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతుందని కొత్తగా మార్పులు చేసిది ఏమి ఉండదని జగన్ తెలిపారు. అన్ని నియమ నిబంధనలు, మూడుసార్లు టెస్టింగ్‌ల తరువాతే వచ్చే రిపోర్టు అనంతరం నెయ్యి లడ్డూ తయారికి వెళ్తుందని అన్నారు. గత టీడీపీ, వైసీపీ హయాంలో నెయ్యి ప్రమాణాలు లేవని టీడీపీ 16 సార్లు, వైసీపీ 18 సార్లు ట్యాంకర్లను తిరిగి పంపించిందని జగన్ గుర్తు చేశారు. రెండు నెలలుగా ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఏమి చేస్తున్నడని ప్రశ్నించారు. క్వాలీడీ రిపోర్ట్‌ను టిడిపి కార్యాలయంలో విడుదల చేస్తారా ఆయన నిలదీశారు.
తిరుమల లడ్డూకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది.. ఇక్కడ తయారీ వ్యవస్థలో ఉన్న నిబంధనలు గొప్పగా చెప్పుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి పవిత్రని చంద్రబాబు అపవిత్రం చేస్తున్నాడని టీటీడీ అనేది చాలా విశిష్టమైనదన్నారు.. మంత్రి వర్గ కూర్పు కంటే టీటీడీ బోర్డు కూర్పు అతి కష్టమని మాజీ సీఎం తెలిపారు. కేంద్రం నుండి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్సు చేస్తారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీటీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ల్యాబ్‌లను మెరుగుపర్చామన్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నగొప్ప భక్తుడని కొనియాడారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమని అన్నారు ఈ వ్యవహారంపై ప్రధానికి, సుప్రీం కోర్టు జస్టిస్‌కి లేఖలు రాస్తాని ఇందులో నిజమైన విచారణ జరగాలి .. చంద్రబాబుకి అక్షింతలు పడాలని జగన్ తెలిపారు