వైఎస్ అభిషేక్‌రెడ్డి పార్థిదేహానికి ఏపీ మాజీ సీఎం జగన్ నివాళులు అర్పించారు. తన సోదరుడు అంత్యక్రియల కోసం పులివెందులకు జగన్ చేరుకున్నారు. అనంతరం ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి చనిపోవడంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మరికాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.ఇవాళ పులివెందులలో అంత్యక్రియల జరగనున్నాయి రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.