నేను అబద్ధాలు చెప్పలేదు.. అందుకే ఓడిపోయాం
మీ జగనే ముఖ్యమంత్రి అయితే ఈపాటికే అమ్మఒడి వచ్చేదని, సున్నా వడ్డీ సొమ్ము బ్యాంక్ లో జమ అయ్యేదని, రైతు భరోసా, విద్యా దీవెన కూడా వచ్చేదని, తాను సీఎం కాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయని చెప్పారు.
చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. నీకు 15వేలు నీకు 15వేలు అని పిల్లలకు చెప్పారని, మహిళలు కనపడితే నీకు 18వేలు, నీకు 18వేలు అన్నారని.. అలా మోసం చేశారని గుర్తు చేశారు. తనను కూడా తమ నాయకులు అలాగే అన్నీ పెంచి చెప్పాలని కోరారని, కానీ తాను అలా మోసం చేయబోనని వారికి తేల్చి చెప్పినట్టు వివరించారు జగన్. ఒకవేళ తాను అసత్యపు హామీలిస్తే.. రేపు నాయకులు ప్రజల వద్దకు వెళ్తే మొహం చెల్లని అన్నారు. నాయకులెవరైనా కాలర్ ఎగరేసి తమ నాయకుడు జగన్ అనుకునేలా తాని నీతి, నిజాయితీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు జగన్.
మీ జగనే ముఖ్యమంత్రి అయితే..
మీ జగనే ముఖ్యమంత్రి అయితే ఈపాటికే అమ్మఒడి వచ్చేదని, సున్నా వడ్డీ సొమ్ము బ్యాంక్ లో జమ అయ్యేదని, రైతు భరోసా, విద్యా దీవెన కూడా వచ్చేదని, తాను సీఎం కాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయని చెప్పారు. త్వరలో చంద్రబాబుకి, టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ఆ పార్టీ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని, ప్రజలు వారిని ఓడిస్తారని, తిరిగి మనల్ని గెలిపిస్తారని అన్నారు జగన్.
కూటమి ప్రభుత్వంలో తిరిగి పాతరోజులు మళ్లీ వచ్చాయని, ఏ పథకం కోసమయినా టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు జగన్. తన హయాంలో వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి అన్ని పథకాలు అందించేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా మోటుకునే అభ్యర్థిని నిలబెట్టానని చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని, కానీ వారు పోటీకి దిగుతున్నారని, అది అన్యాయం అని చెప్పారు. చంద్రబాబునాయుడనే ఓ దుర్మార్గుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ఆ మనిషికి న్యాయం, ధర్మం లేవని చెప్పారు జగన్.