అవతరణ దినం నిర్వహించకపోవడం దారుణం : రోజా
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అవతరన దినోత్సవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.

ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అవతరన దినోత్సవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. గత వైసీపీ పాలనలో నవంబర్ 01వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని కూటమి సర్కార్ దీనిని నిర్వహించకపోవడం దారుణమని పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసే ఈ నిర్ణయం ఉంది” అంటూ రోజా ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా..? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే..భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..?
చంద్రబాబు… తక్షణమే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా నిర్వహించాలి. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొంది.“మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు అవతరన దినం ఉంది. కర్ణాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు ఉంది. ఒడిశాకు కూడా అవతరణ దినం ఉంది. కానీ చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినోత్సవం లేకుండా పోయిందని ఆమె అన్నారు. మా జగన్ అన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 01వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాం. చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవ నిర్వహణ రద్దు చేసిందని రోజా తెలిపారు.