జగన్ షేర్లు బదిలీ చేశారనేది అబద్ధం : వైఎస్ షర్మిల
వైసీపీ అధినేత జగన్ కుటుంబ విషయాలను రోడ్డుపైకి తీసుకొచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్మించారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఫ్యామిలీ విషయాలను రోడ్డుపైకి తీసుకొచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్మించారు. సోదరిపై ప్రేమతో జగన్ షేర్లు బదిలీ చేశారనేది అబద్దమన్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటచ్ చేయలేదని భూములను మాత్రమే అటాచ్ చేసినట్లు షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దు కోసమే ఇదంతా తాము చేస్తున్నామనడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా షర్మిల అభివర్ణించారు.
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారు. ఆస్తులను లాక్కునేందుకు.. ఈడీ కేసులని, తన బెయిల్ రద్దవుతుందని ఏవేవో కారణాలు చెబుతున్నారు. ఈడీ కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసింది. కంపెనీ షేర్ల వరకు రాలేదు. ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చు. ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బదిలీని మాత్రం ఎప్పుడూ ఆపలేదని షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్రకు అనడం పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల అన్నారు.