Telugu Global
Andhra Pradesh

మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

తనపై నమోదైన పరువునష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన క్వాష్‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు. వరుసగా విచారణకు సమయం కోరుతున్నారని పిటిషన్ ని రెగ్యులర్ విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు.

కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో హైకోర్టు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఓ పత్రికలో రాసిన కథనాలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ దావా వేశారు. విచారణకు హాజరు కావాలంటూ జగన్ కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది.

First Published:  29 Jan 2025 6:06 PM IST
Next Story