మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
BY Vamshi Kotas7 Feb 2025 9:00 PM IST
![మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401375-mla.webp)
X
Vamshi Kotas Updated On: 7 Feb 2025 9:00 PM IST
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సెల్ఫీ వీడియో బయటికి రాకుండా కొలికపూడి బెదిరించారని ఆరోపించాడు. కాగా, నిన్న పురుగులమందు తాగిన డేవిడ్... ప్రస్తుతం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.
Next Story