Telugu Global
Andhra Pradesh

ఇంటర్‌తో చదువు ఆపేశాను.. కానీ చదవడం ఆపలేదు : పవన్ కళ్యాణ్

తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు

ఇంటర్‌తో చదువు ఆపేశాను.. కానీ చదవడం ఆపలేదు : పవన్ కళ్యాణ్
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ బుక్ ఎగ్జిబిషన్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుస్తక ప్రదర్శన ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనకు లైఫ్‌లో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని పవన్ అన్నారు. అటువంటి పుస్తకాలను తన సంపద గా భావిస్తానని.. తన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తానని.. తన జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమై పోయే వాడినో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్‌తో చదువు ఆపేశాను కానీ చదవడం ఆపలేదు.. రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ.. పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తా. పుస్తకం ఇవ్వాలంటే నా సంపద ఇచ్చినంత మథనపడతా. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా.. కానీ నా వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వను. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందాన్నారు. పుస్తకాలు అంటే ప్రాణం నున్న ఈ స్థాయిలో నిలబెట్టింది పుస్తకలే అన్నారు. అలాగే రెండు చోట్ల ఓడిపోయిన పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయని. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు ఈసందర్భంగా కృష్ణారావు రాసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.

First Published:  2 Jan 2025 9:31 PM IST
Next Story