Telugu Global
Andhra Pradesh

తెలంగాణల్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు..కాంగ్రెస్‌ సర్కార్‌‌పై హరీశ్‌ ఆగ్రహం

తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరు శాపంగా మారిందన్నారు

తెలంగాణల్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు..కాంగ్రెస్‌ సర్కార్‌‌పై హరీశ్‌ ఆగ్రహం
X

తెన్నికలలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరు శాపంగా మారిందన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత హస్తం పార్టీకే దక్కుతుందని విమర్శించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలన్నారు. మహారాష్ట్ర ఎ ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు అన్నదాత బాధలను పట్టించుకునే సమయం లేదా అని ప్రశ్నిచారు.

First Published:  11 Nov 2024 2:52 PM IST
Next Story