Telugu Global
Andhra Pradesh

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
X

రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసును స్పెషల్‌ కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు. నిందితులకు సాధ్య‌మైనంత‌ త్వరగా శిక్షపడేలా చేస్తామన్నారు. మహిళల రక్షణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎవ‌రు నేరాల‌కు పాల్ప‌డినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

నేరాలు చేసినవాళ్లు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.క్రైమ్ రేటు తగ్గిండచడమే తమ ప్రాధాన్యమని అన్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల వ‌ద్ద ప‌టిష్ట‌మైన‌ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, అన్ని ప్రార్థనాలయాల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిప‌రిస్థితుల్లో రాజీప‌డ‌ద‌ని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే సీఎం స్వయంగా ఆరా తీస్తున్నారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మహిళల భద్రత విషయంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే ముఖ్యమంత్రే సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే ఎస్పీకి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని హోం మంత్రి అన్నారు.

First Published:  15 Oct 2024 2:38 PM IST
Next Story