Telugu Global
Andhra Pradesh

ఫ్యాక్ట్ చెక్.. ఏపీ టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్

గతంలో సందిగ్ధంలో ఉన్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించారని, కచ్చితంగా ఇకపై అలాగే అటెండెన్స్ వేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని వార్తలొస్తున్నాయి.

ఫ్యాక్ట్ చెక్.. ఏపీ టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్
X

కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ప్రభుత్వ టీచర్ల అటెండెన్స్ విధానంలో మార్పులు వచ్చాయని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. గతంలో సందిగ్ధంలో ఉన్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించారని, కచ్చితంగా ఇకపై అలాగే అటెండెన్స్ వేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని అంటున్నారు. కూటమికి ఓట్లు వేసిన ప్రభుత్వ టీచర్లు లబోదిబోమంటున్నారంటూ వైసీపీ కామెంట్లు మొదలు పెట్టింది.


టీచర్ల ఫేషియల్ అటెండెన్స్ వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అది ఫేక్ వార్త అని తేల్చేసింది. ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు.


వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కలవరపడిన అంశాల్లో ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం ఒకటి. అప్పటికే అదనపు పనులు అప్పజెప్పారని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అటెండెన్స్ విధానంలో కూడా మార్పులు తెచ్చేసరికి, బడికి ఆలస్యంగా వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. సరైన టైమ్ కి వచ్చినా నెట్ వర్క్ సమస్యల వల్ల ఆన్ లైన్ లో ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ పడటంలేదనేది మరికొందరి వాదన. దీంతో ఎన్నికల్లో వారంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆ పార్టీ భావిస్తోంది. అలా ఓట్లు వేసి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం చివరకు వారికే షాకిచ్చిందంటూ వైసీపీ ట్వీట్ వేసింది. ఈ ట్వీట్ పై అధికారులు స్పందించారు, అది ఫేక్ న్యూస్ అని తేల్చారు.

First Published:  10 July 2024 6:49 AM IST
Next Story