Telugu Global
Andhra Pradesh

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడి..బస్ టికెట్‌ ధర రూ.6 వేలు

సంక్రాతికి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిలువు దోపిడి చేస్తుంది.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడి..బస్ టికెట్‌ ధర రూ.6 వేలు
X

సంక్రాంతి పండక్కి వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ. 6వేలు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా టికెట్‌ రేట్లు అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిన టికెట్‌ ఛార్జీలు పెంచినా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారుని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఆర్టీసీ బస్సుల కంటే రెండు నుంచి మూడుంతలు అదనంగా వసూలు చేస్తున్నాయి.

ఏపీలోని విజయవాడ, గుంటూరు తిరుపతి, పాలకొల్లు, విశాఖపట్నం, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి వెళ్లేందుకు ఒక్కో టికెట్‌పై రెండు నుంచి మూడు వేలు పెరగడంపై ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గతంలో రూ.1000 రూపాయలు, రూ.1200 ఉన్న టికెట్ తాజాగా రూ.3000 పైమాటే ఉంది. భీమవరం వెళ్లే ప్రయాణికుల నుంచి రూ. 3000 నుంచి రూ.4000, రాజమండ్రికి రూ. 3500 నుంచి రూ.4000 చెల్లించాల్సి వస్తుంది. ఇందేంటని ప్రశ్నిస్తే.. పండగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయింపుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ. 15 వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రెట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడ్డుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  10 Jan 2025 3:32 PM IST
Next Story