Telugu Global
Andhra Pradesh

ఆ కారు ఎక్కడ కనిపించినా మేడిన్‌ ఆంధ్రా అంటున్నారు

ఇది ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్న మంత్రి లోకేశ్‌

ఆ కారు ఎక్కడ కనిపించినా మేడిన్‌ ఆంధ్రా అంటున్నారు
X

పంట పండని ప్రాంతంలోనూ కార్లు పరుగెత్తించిన ఘటన సీఎం చంద్రబాబుదని మంత్రి లోకేశ్‌ అన్నారు. మంగళగిరి పరిధిలోని కియా కార్ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. టీసీఎస్‌ను ఒప్పించి పెట్టుబడులు తేవడంతోనే సంతృప్తి చెందలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు. దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్‌ ఆంధ్రా అంటున్నారు. పెద్ద పరిశ్రమలను ఒప్పించి రాష్ట్రానికి తెస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 70 కార్ల సర్వీస్‌ చేసేలా ఆధునిక సౌకర్యాలతో ఇక్కడ కియా షోరూమ్‌ ఏర్పాటు చేశారు.

ఇది ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. కరువు ప్రాంతం అనంత గడ్డపైకి కియా రావడానికి చంద్రబాబే కారణమన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు మండిపల్లి రామ్‌ప్రసాద్‌, పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  11 Oct 2024 12:50 PM IST
Next Story