Telugu Global
Andhra Pradesh

అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం మగతనం కాదు : పవన్ కళ్యాణ్

అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం మగతనం కాదు : పవన్ కళ్యాణ్
X

అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో గోకులాలను ప్రారంభించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ అమ్మ లేనిదే సృష్టి లేదు. మగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే తొక్కి నారా తీస్తాం క్రిమినల్స్‌కి కులం లేదు.. ప్రజాప్రతినిధులకు కులం లేదు.. తప్పు చేసిన ఎవడినైనా శిక్షించండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తనను నమ్మి గెలిపించారు. ఒళ్లు వంచి పని చేసిన తరువాతనే మళ్లీ ఓట్లు అడుగుతానని తెలిపారు. తనతో సహా అందరికీ 6నెలల హనీమూన్ పీరియడ్ పూర్తయిందన్నారు. 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

దీనికి అధికార యంత్రాంగం సహకారం కావాలని కోరారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే. తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. తనకు అధికారం అలంకారం కాదు.. బాధ్యత అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలని పవన్ కోరారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తారని పవన్ అన్నారు.అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నాని ఆయన అన్నారు.

First Published:  10 Jan 2025 4:33 PM IST
Next Story