శ్రీవారి లడ్డూలో కల్తీ ఉందని ప్రమాణం చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా ? : అంబటి
శ్రీవారి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ ఉందని ప్రమాణం చేసే దమ్ము చంద్రబాబుకు ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
శ్రీవారి లడ్డూ నాణ్యత వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మాజీ సీఎం జగన్‌పై కక్షసాధింపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అంబటి అన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తిరుమల లడ్డు కల్తీపై డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. లడ్డు తయారిలో జంతువుల కొవ్వు లు ఉన్నాయని చెప్పడం దుర్మార్గమని టీడీపీ నాయకుల అనుమానం మాత్రమే. లడ్డులో గాని నెయ్యిలో గాని కల్తీ జరిగితే, అది నిరూపణ అయితే, చర్యలు తీసుకోవచ్చు అని రాంబాబు తెలిపారు. రెండు నెలల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన సమాచారం మీరు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.
టెస్టు లకు పంపించిన మూడు నెయ్యి కంటైనర్ లు ఎవరి హయాంలో వచ్చాయి. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలలో గతంలో కల్తీ ఉందని అనుమానంతో అనేక సార్లు కొన్ని నెయ్యి కంటైనర్ లను రిజక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కోట్ల మంది లడ్డు ప్రసాదం స్వీకరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి జంతు కొవ్వు అని చెప్పి భక్తుల మనోభావాల తో ఆడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పాలి. దేవుడ్ని అడ్డం పెట్టుకొని జగన్ పై కక్ష తీర్చుకోవద్దు అని అంబటి రాంబాబు అన్నారు. తిరుమల ఆలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ ఉందని ప్రమాణం చేసే దమ్ము చంద్రబాబుకు ఉందని అంబటి ప్రశ్నించారు.