ముద్దు కృష్ణమ కుటుంబంలో చీలిక
12న వైసీపీలోకి జగదీశ్ ప్రకాశ్?
BY Naveen Kamera10 Feb 2025 7:57 PM IST
![ముద్దు కృష్ణమ కుటుంబంలో చీలిక ముద్దు కృష్ణమ కుటుంబంలో చీలిక](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402221-gali-jagadessh-prakash.webp)
X
Naveen Kamera Updated On: 10 Feb 2025 7:57 PM IST
దివంగత టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబంలో చీలిక వచ్చిందని సమాచారం. ఆయన రెండో కుమారుడు గాలి జగదీశ్ ప్రకాశ్ వైసీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ప్రచారం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తోంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాలి భానుప్రకాశ్ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భానుప్రకాశ్ రోజా చేతిలో ఓడిపోయారు. సోదరుల మధ్య విభేదాల కారణంగానే జగదీశ్ ప్రకాశ్ టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
Next Story