Telugu Global
Andhra Pradesh

న్యూఢిల్లీలో ఏపీ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ" అనే అంశంపై సెమినార్

ఫిబ్రవరి 1 నుండి 9 వరకు నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఏపీ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ" అనే సెమినార్ నిర్వహించారు

న్యూఢిల్లీలో ఏపీ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనే అంశంపై సెమినార్
X

న్యూఢిల్లీలో"ది రోల్ ఆఫ్ అన్ డివైడెడ్ ఏపీ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ" అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుండి వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న 4 గురు ఆచార్యులతో చర్చ గోష్టి పాల్గోన్నారు. ఫిబ్రవరి 1 నుండి 9 వరకు నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలో ఇవాళ థీం పెవిలియన్, హాలులో నిర్వహించారు. ఇందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీ, అసోసియేట్ ప్రొఫెసర్ పారిపెళ్లిశంకర్ , యోగివేమన విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ సతీష్ బాబుఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు దాని అనుబంధ కళాశాల నుండి ప్రొఫెసర్ రంగు ఝాన్సీ ప్రొఫెసర్ రెవ్వూరి నర్సయ్య లు పాల్గొన్నారు.

సంధాన కర్తగా నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ఎడిటర్ పత్తిపాక మోహన్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ లో తెలుగువారు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగం ఏ విధంగా నిర్మాణం చేయబడింది దాని ద్వారా ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిరక్షించబడి సమాన హక్కులు విధులు , బాధ్యతలు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, పౌరసత్వము, కార్మిక చట్టాలు, వ్యవసాయ సంస్కరణలు , సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటిఅంశాలపై ఆనాటి ఉద్దండులైన తెలుగువారు కృష్ణస్వామి అయ్యర్ ప్రకాశం పంతులు దుర్గాబాయి దేశ్ముఖ, సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజినీ నాయుడు , N G రంగా , కొండా వెంకట రంగాెడ్డి, వివి గిరి వంటి వారి సలహాలు, సూచనలు, రాజ్యాంగ నిపుణులు భారత రాజ్యాంగం లో పొందుపరిచిన విధానం గురించి చర్చించారు.

First Published:  8 Feb 2025 7:55 PM IST
Next Story