డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్‌ని కలిశారు. మెగా హీరో రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆంధప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు దిల్ రాజు ఆయనకు వివరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాతగా ఉన్న దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించరాు. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు.సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు పైన ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.