కూటమి సర్కార్‌లో చీకటి రోజులు నడుస్తున్నాయి : జగన్
రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి.వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ లేదు..సూపర్ సెవెన్ లేదని జగన్ అన్నారు. ఐదు నెలలుగా కూటమి సర్కార్ అన్ని వర్గల ప్రజలను మోసం చేసిందని ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తోందని జగన్ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు మహిళలతను కించరుస్తూ పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. చంద్రబాబు హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, అన్ని వ్యవస్థలను నీరుగార్చారని జగన్ ఆరోపించారు. ‘5 నెలల్లో 91 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. విద్యావ్యవస్థలో మేము తీసుకొచ్చిన సంస్కరణలను నిర్వీర్యం చేశారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు.
టీటీడీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇస్తున్నారు. ఇప్పటికే లక్షన్నర పింఛన్లు కట్ చేశారు.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను గాలికి వదిలేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలయ్యింది. ప్రభుత్వం స్పందించి నేరాల్ని అరికట్టకుండా.. ప్రొత్సహిస్తోంది. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారు. నిందితుడు.. టీడీపీకి చెందిన వ్యక్తే. బద్వేల్ ఘటన.. అత్యంత దారుణం. పెట్రోల్ పోసి బాలికను చంపారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఘటన జరిగింది. అత్తాకోడలపై అత్యాచారం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ ఘటన జరిగింది. ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.