నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి వేడుకల్లో భాగంగా నారావారిపల్లెలో గ్రామదేవత గంగమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబం పూజలు చేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రెండోరోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ దేవతకు ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న నాగులమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తన తల్లిదండ్రలు నారా ఖర్జూర నాయుడు, అమ్మాణమ్మ సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. తదనంతరం తన ఇంటి వద్ద నందమూరి తారక రామారావు బసవతారకం విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు.
పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ దంపతులు గ్రామంలో మహిళలకు, పిల్లలకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రజల నుంచి సీఎం వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర,తదితరులు తదితరులు పాల్గొన్నారు