Telugu Global
Andhra Pradesh

కననదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కననదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కననదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డోనర్‌ సెల్‌ వివరాలను దేవదాయ శాఖ కమిషనర్‌, ఈవో సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు. తిరుపతి తరవాత రెండో అతిపెద్ద దేవాలయం దుర్గగుడి అని తెలిపారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.‘‘మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం. లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మను కోరుకున్నా. సేవా కమిటీ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నాం. దుర్గగుడి పాలక మండలి సభ్యులకు అభినందనలు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు.

First Published:  9 Oct 2024 4:24 PM IST
Next Story