Telugu Global
Andhra Pradesh

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఉరట

సుప్రీం కోర్టులో సీఎం చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఉరట
X

సుప్రీం కోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఉరట లభించింది. స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్‌లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. కాగా.. ఇదే కేసులో గతంలో.. సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

First Published:  15 Jan 2025 1:06 PM IST
Next Story